Milk Facts (Goat and Cow) & Side Effects| Best Alternatives of Milk in Telugu
పాలు, (ఆడ) స్తన్య జీవులలో అప్పుడే పుట్టిన తమ బిడ్డకు ఆరోగ్య కారకమైన ఆహారం అందించే నిమిత్తం భగవంతుడు అమర్చిన ఒక అపురూపమైన వ్యవస్థ. పాలు, తల్లి స్తనం నుండి తన బిడ్డ నోటికి నేరుగా చేరవలసిన అస్థిర పదార్థం. బిడ్డ పుట్టిన వెంటనే, తల్లి తన బిడ్డకు ఆహారంతో బాటు రోగనిరోధక శక్తిని అందించడానికి ప్రతిరక్షకాలను (antibodies) నింపి ప్రారంభ స్తన్యాన్ని (Colostrum) అందిస్తుంది.బిడ్డ పెరుగుతూ ఉంటే, పౌష్టికాంశాల అవసరాలు మారుతూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా తల్లి పాలలో పోషకాల నిబంధన (nutrient composition) కూడా మారుతూ వస్తుంది. అదే తల్లి అదే బిడ్డకు మొదటి వారంలో ఇచ్చిన పాలకు, ఆరోవారంలో ఇచ్చిన పాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇది భగవంతుడు తల్లి దేహంలో అమర్చిన అద్భుత వ్యవస్థ.
ఏ తల్లి పాలు ఆ బిడ్డకు మాత్రమే పరిపూర్ణ ఆహారము. ఆవు పాలను తన దూడకు ఆహారంగా ఇస్తుంది కానీ మన బిడ్డలకు, మనకు కాదు. ఆవు దూడ పెరుగుదల విధానానికి మనిషి బిడ్డ పెరుగుదల క్రమానికి చాలా తేడా ఉంది. అటువంటప్పుడు ఆవుపాలు మన బిడ్డలకు ఎలా మేలు చేస్తాయి? మేలు చేయకపోగా హాని కలిగిస్తాయి
మనిషి జీర్ణ వ్యవస్థలో, పాలను ఆరిగించే కిణ్వం (enzyme) మూడు నుండి నాలుగేళ్ల వయసులో జన్యుపరంగా ఆపివేయ బడుతుంది. అంటే మూడు నాలుగేళ్ల వయసు తర్వాత మనకు పాలు అవసరం లేదని ప్రకృతే నిర్ణయించింది.
వైజ్ఞానికులు, వైద్యులు, ఆహార నిపుణులు 'పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్య పుస్తకాలలో వ్రాసి, పదేపదే చెప్పడం వలన అదే నిజం అని మానవజాతి అంతాను గట్టిగా నమ్ముతున్నది. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. దీనికి మద్దతుగా పాల కంపెనీలు పాల ఉత్పాదన అపారంగా పెంచే నిమిత్తం ఆవులకు, గేదెలకు రసాయనిక ప్రచోదక పదార్థాలను సూది మందు (steroids and oxytocin injections) రూపంలో ఇచ్చి కృత్రిమంగా పాల ఉత్పత్తి అమాంతం పెంచేశారు. జన్యు మార్పిడి ద్వారా ఎక్కువ పాలు ఇచ్చే ఆవు జాతులను తయారు చేసి ఇదే క్షీర విప్లవం' (White Revolution) అని వైజ్ఞానికులు ఢంకా బజాయిస్తున్నారు. ఈ పాల వల్ల కలుగుతున్న అనర్థాలు వారికి కనిపించటం లేదు. ఇది మనకు సైన్స్ చేసిన నిర్వాకం
ఈ పాలను తాగి మానవజాతి మొత్తం అనారోగ్యాల బారిన పడిపోయింది. దాదాపు ఆడవారందరు హార్మోన్ల అసమతూలనలతో బాధపడుతున్నారు. థైరాయిడ్, గర్భాశయ సంబంధ సమస్యలైన పిసిఒడి, సంతానలేమి వంటి వాటిని ఎదుర్కొంటున్నారు. పదమూడు, పద్నాలుగు సంవత్సరాలకు రజస్వల కావలసిన ఆడపిల్లలు ఈ కృతక పాలను త్రాగి, ఆరు సంవత్సరాలకే అవుతున్నారు. ఇదే మనం సాధించిన వైజ్ఞానిక ప్రగతి.
ఈ విషయాలన్నింటినీ డాక్టర్ ఖాదర్ వలీ గారు క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ఈ అనర్ధాలన్నిటికీ మూల కారణం పాలు అని గమనించి, పాలు త్రాగడం మానేయడమే పరిష్కారమని చెప్పి తన వద్దకు వచ్చే వేల రోగులకు నయం చేస్తూ వస్తున్నారు. పాలు మానేసిన వీరికి ఆరు వారాలలోనే 90 శాతం హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలకు ఉపశమనం లభించడం గమనార్హం.
Best Alternatives for Milk | పాలు త్రాగకపోతే మరి కాల్షియం ఎక్కడ నుండి వస్తుంది
ఒక లీటరు పాలు కేవలం ఒక గ్రాము కాల్షియం ఉంటుంది ఈ ఒక గ్రాము ( మిల్లీ గ్రాములు) నుండి 180 మిల్లీ గ్రాముల కాల్షియం మాత్రమే మన దేశం గ్రహిస్తుంది. అదే 100 గ్రాముల నువ్వులను నాన పెట్టి చేసుకున్న పాలలో ఒక గ్రాము కాల్షియం ఉంటుంది. ఏ కాల్షియం మొత్తాన్ని మన దేశం గ్రహిస్తుంది.సస్యాధారిత (plant based) పదార్థాలలో లభించే పోషకాలను గ్రహించడానికి అనువుగా ఉంటుంది మన పచనక్రియ వ్యవస్థ. అందుకే మన పిల్లలకు కొబ్బరి పాలు, రాగి పాలు, సజ్జపాలు, నువ్వుల పాలు , కుసుమ పాలు, కొర్రపాలు కొద్దిగా తాటి బెల్లం కలిపి మార్చిమార్చి ఇస్తే మానసికంగానూ శారీరకంగా చురుకుగా ఉంటారు.
ఈ పాలతో పెరుగు, మజ్జిగ చేసుకుని తింటే విటమిన్ బి12 కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇవేకాక దేశీ ఆవు పాలతో చేసిన పెరుగు, మజ్జిగలను కూడా తీసుకోవచ్చు. పాలు మంచివి కానప్పటికీ తోడు పెట్టడం వల్ల సూక్ష్మజీవులు పాలలోని దోషకారకాలను హరించేస్తాయి
Post a Comment