How to Clean Vegetables & Fruits from Pesticides or Chemicals in Telugu
ప్రస్తుత పరిస్థితులలో మనకు దొరికే దాదాపు 90 శాతం కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు విషపూరితమైన పురుగుమందుల వాడకంతోనే పండించినవి. ఇవి తిని మనం అనేక రోగాల బారిన పడుతున్నాము. ఈ క్రిమి కీటక కలుపు నాశక పదార్థాల ప్రభావం చాలావరకు తగ్గించుకోవడానికి ఒక చక్కని చిట్కాను డాక్టర్ ఖాదర్ వలీ గారు సూచించారు.
ఒక నిమ్మపండంత చింతపండు గుజ్జును తీసి రాగి ఫలకంతో శుద్ధి చేసిన సుమారు మూడు లీటర్ల నీటిలో కలిపి, అందులో వండుకోవలసిన కూరగాయలను కనీసం 15 నిమిషాలు నానబెట్టి, ఆ తరువాత శుభ్రమైన నీటిలో కడిగి వాడుకోవాలి.
How to Clean Vegetables in Telugu Video
ఇలా చేయడం వలన చింతపండులోని టార్టారిక్ ఆమ్లం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల పైన చల్లిన విషరసాయనాల దుష్ప్రభావాన్ని కొంత వరకు తగ్గిస్తుంది.
ముందు రోజు రాత్రే చింతపండు నానబెట్టి ఉంచుకుంటే మెత్తపడి గుజ్జు తేలికగా వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్న చింతపండు నీటిని రోజంతా కూరగాయలు, పండ్లు శుద్ధి చేసుకోవడానికి వాడుకోవచ్చు
Post a Comment