వంటకు వాడకూడని పాత్రలు ఏవి, వాడవలసినవి ఏవి? What vessels to Use to Cook in Telugu

Best Vessels for Cooking in Telugu


  • సిరి ధాన్యాలతో అన్నం వండుకోడానికి, గంజి కాచుకోవడానికి అంబలి పులియబెట్టుకోడానికి, మట్టి పాత్రలను వాడుకోవటమే ఉత్తమం. అవి లేని పక్షంలో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడుకోవచ్చు
  • దోశలు, చపాతీలు, మొదలగు వాటికి ఇనుప పెనం మాత్రమే వాడాలి
  • కంచు, ఇత్తడి, ఇనుప పాత్రలలో పులుపు అంశం కలిగిన పదార్థాలు వాడకూడదు
  • కూరలు దళసరి స్టీలు పాత్రలు మూకుళ్లలో లేదా మట్టి మూకుళ్లలో చేసుకోవచ్చు
  • రాగి బిందెలు/పాత్రలు కేవలం నీరు నిల్వ ఉంచటానికి మాత్రమే వాడుకోవాలి వంటలు చేయకూడదు
  • అల్యూమినియం పాత్రలలో వండడం కాని, నూనెలు, పాలు వంటి ఆహార పదార్థాలను ఉంచటం కానీ చేయకూడదు. అల్యూమినియం ఫాయిల్, అల్యూమినియం డిస్పోజబుల్ డబ్బాలకు దూరంగా ఉండాలి.
what are the cooking vessels to use in telugu

  • అల్యూమినియం మానవ దేహానికి హానికరమైన లోహం
  • నాన్ స్టిక్ పాత్రలు, మూకుళ్లు, పెనాలు అత్యంత హానికరమైనవి. కాన్సర్ వంటి భయంకరమైన రోగాలను కలుగు చేసే రసాయనాలను పైపూతగా కలిగి ఉంటాయి. ఈ పాత్రలు మన వంటింట్లో ఉండటానికి ఏమాత్రం అర్హత లేనివి. తక్షణమే వీటిని త్యజించి మీ ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కూడా కాపాడుకోండి.
  • ఉప్పు, చింతపండు వంటి వాటిని గాజు, పింగాణీ లేదా రాతి జాడీలలో ఉంచుకుంటే మంచిది.
  • ప్రెషర్ కుక్కర్ లో ముఖ్యంగా అల్యూమినియం కుక్కర్లో అసలు వండకూడదు. ఒత్తిడి మీద వండటం వలన సిరి ధాన్యం కానీ, పప్పులు కానీ సరిగా నానక, విచ్చుకోకపోవడం వలన మనము వాటిలోని పోషకాలను పొందలేము. సమయం ఆదా అయినప్పటికీ పోషకాలను కోల్పోతాం. -
  • ప్లాస్టిక్ లంచ్ బాక్సులను , మంచి నీటి సీసాలను, ప్లాస్టిక్ చెంచాలను తక్షణమే పారవేయండి. వీటిలో ఆహారం తింటే క్యాన్సర్ వంటి రోగాలకు ఆహ్వానం పలికిన వారు అవుతారు.
  • కావలసిన దానికంటే కొద్దిగా తక్కువ వండుకోండి. రెఫ్రిజరేటర్లో పెట్టుకున్న ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు
  • పెరుగు, మజ్జిగ వంటి వాటిని కూడా ఎంత అవసరమో అంతే తోడు పెట్టుకోవాలి. అతి వేడి, అతి చల్లని పదార్థాలు సేవించకూడదు.

Post a Comment

Previous Post Next Post