How to Make Verusanaga Perugu | Peanuts Milk Curd in Telugu
కావలసిన పదార్థాలు1. వేరుశనగ గుళ్ళు : ఒక కప్పు
2. నీళ్లు : రెండు కప్పులు
3. చిలికిన పెరుగు : ఒక పెద్ద చెంచాడు (20 మి. లీ.)
తయారీ విధానం
ఒక కప్పుడు వేరుశనగ గుళ్ళు శుభ్ర పరుచుకుని, ఆరు గంటల సేపు నానబెట్టాలి. ప్రతి రెండు గంటలకు ఒక సారి వేరుశనగలు నానపెట్టిన నీటిని మారుస్తూ ఉండాలి లేనియెడల దుర్వాసన రావచ్చు. నానిన వేరుశనగ గుళ్ళను కొద్దికొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి మొత్తం రెండు కప్పుల నీటిని వాడుకోవాలి శుభ్రపరచిన పలుచని తెల్ల నూలు (కాటన్) బట్టసంచి/బట్ట సాయంతో వేరుశనగ పాలను, రుబ్బిన గుజ్జునుండి వేరు చేసుకోవాలి.
దళసరి గిన్నెలో ఈ పాలను పోసి సన్నని మంటపైన కలుపుతూ పొంగే సమయానికి పొయ్యి మీద నుండి దింపేయాలి. ఈ పాలు బాగా చిక్క పడతాయి. అది సహజం కంగారు పడకండి. కాగిన పాలను మట్టి పాత్రలో పోసి చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు పెద్ద చెంచాడు చిలికిన దేశీ ఆవు పాల పెరుగు తోడు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. వాతావరణాన్ని బట్టి నాలుగు నుంచి ఎనిమిది గంటల లోపు పెరుగు తయారు అవుతుంది. ఇలా తయారైన పెరుగును రెఫ్రిజరేటర్ లో పెట్టు కోవాలి. లేనిచో మరీ పులిసిపోయింది.
మొదటిసారి మాత్రమే ఆవు పాల పెరుగు తోడుకు వాడుకోవాలి. ఆ తరువాత నుండి వేరుశనగ పెరుగునే వాడుకోవచ్చు. చిన్న చిట్కా వేరుశనగ పాలు పొంగుతున్నప్పుడు రెండు పెద్ద చెంచాల అంటే 30 మి.లీ. కొర్రల పాలు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. గోరువెచ్చ పడ్డాక ఈ పాలను తోడు పెడితే గట్టి వేరుశనగ పెరుగు తయారవుతుంది.
Post a Comment