Thati Bellam Uses & Health Benefits in Telugu Palm Jaggery in Telugu by Khadar Vali
తీపి పదార్థం సహజంగా పండ్లలో ఉంటుంది. భూతలం మీద మనిషి తయారు చేసుకున్న మొదటి తీపి పదార్థం ఆరోగ్యదాయకమైన ఈత, తాటి నీరా తో తయారు చేసేకున్న బెల్లమే. దక్షిణ భారత దేశంలో తుంగభద్ర నదుల పక్కనున్న ఈత చెట్ల నుంచి మొదట బెల్లం తయారు చేసుకోవడం ప్రారంభమైందని చెబుతారు. ఈత, తాటి బెల్లం తిన్నంత కాలం మనుషులు ఆరోగ్యంగానే ఉన్నారుకాలక్రమంలో చెరకు రసంతో చక్కెర తయారు చేసుకోవటం ప్రారంభమైంది. ఈ చక్కెరతోనే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే చక్కెరలో ఫ్రక్టోజ్ తక్కువగా, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. చక్కెర నాలుక మీద వేసుకున్న 2, 3 నిమిషాల్లోనే గ్లూకోజ్ రక్తంలోకి చేరిపోతుంది. చక్కెర ద్వారా, వరి అన్నం ద్వారా తిన్న వెంటనే ఎక్కువ మోతాదులో గ్లూకోజ్ రక్తంలోకి వస్తుండటం వల్లనే దేహం రోగగ్రస్తంగా మారుతున్నది.
Palm Jaggery in Telugu
నిదానంగా గ్లూకోజ్ ని అందించే తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగ బెల్లం ఆరోగ్యదాయకమైన తీపి పదార్థాలని అందరూ గుర్తించాలి. వీటిల్లో ఫ్రక్టోజ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగ బెల్లం తిన్నప్పుడు ఫ్రక్టోజ్ గ్లూకో గా మారటానికి గంటన్నర, రెండు గంటలు పడుతుందిఒక్కమాటలో చెప్పాలంటే.. ఈత, తాటి, జీలుగ బెల్లంలో తక్కువగా ఉండే గ్లూకోజ్ తిన్న కొద్ది సేపట్లో రక్తంలో కలుస్తుంది. ప్రక్టోజు ద్వారా తీపి పదార్థంతోపాటు ఐరన్, పీచు కూడా దొరుకుతుంది. చెరకు చక్కెర ఇవేవీ లేవు.
Palm Sugar Uses and Health Benefits in Telugu
తాటి బెల్లంలో ప్రక్టోజ్ అధిక పాళ్ళలో ఉంటుంది. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. తాటి బెల్లాన్ని తాటి చెట్ల నుంచి తీసిన నీరాతో తయారు చేస్తారు. దీన్ని తయారు చేసే క్రమంలో ఎటువంటి రసాయనాలు కలపరు. అందువల్ల ఎటువంటి నిల్వ రసాయనాలను కలపకపోయినా ప్రకృతిసిద్ధమైన ఖనిజ లవణాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. పొడి దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి జబ్బులను నయం చేయ డానికి తాటి బెల్లాన్ని వినియోగించడం పూర్వ కాలం నుంచి ఉన్నదే. తెల్ల చక్కెరకు ఇది ఆరోగ్యదాయకమైన చక్కని ప్రత్యామ్నాయ తీపి పదార్థం.అంతేకాదు, పిల్లలు, పెద్దలకు శక్తిని అధికంగా అందిస్తుంది. తాటి బెల్లం లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం. ఐరన్, ఫాస్ఫరస్, జింక్ తో పాటు కాల్సియం కూడా ఉంటుంది.
Post a Comment