జొన్నల పాలు | How to Make Jonnala Palu in Telugu Health Benefits
కావలసిన పదార్థాలు1. జొన్నలు : 50 గ్రాములు
2. నీళ్లు : 500 మి.లీ.
3. తాటి బెల్లం పాకం : కొద్దిగా
తయారీ విధానం
జొన్నలు కడిగి 6 నుండి 8 గంటలు నానపెట్టుకోవాలి. నానపెట్టిన నీటిలో కొద్దిగా నీటిని ఉపయోగించి జొన్నలను మిక్సీ లేదా రోలుతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీటిని కూడా కలుపుకొని అన్నిటినీ శుభ్రమైన గుడ్డతో వడగొట్టుకోవాలి. తరువాత తగినంత తాటి బెల్లం పాకం కలుపు కోవాలి. పాలను వేడి చేసుకోడానికి ఇంకొక వేడినీటి గిన్నెలో ఈ పాల గిన్నెను పెట్టి వేడి చేసుకోవాలి.
గమనిక: జొన్నలు తటస్థ ధాన్యాలు అయినా జొన్నలు పాలు 15 సంవత్సరముల లోపు పిల్లలకు ఇవ్వడం మంచిది అని డా. ఖాదర్ వలీ గారు సూచించారు. జొన్నల్లో కార్బోహైడ్రేట్ కాక ప్రోటీన్స్, ఐరన్, మెగ్నీషియం వంటి అనేక సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి.
Post a Comment